నడినెత్తికి ఎండొచ్చిన
కన్నీరును ఆవిరిచెయ్యలే
కారుచీకట్లను నమ్ముకొని
శూన్యంలో చిక్కుకుపోతి
దెప్పిపొడుపులు కూడబెట్టిన
ధైర్యాన్ని ముక్కలు చేస్తున్నై
అవమానాలు గొంతునున్న
అన్నం ముద్దను దిగనియట్లేవు
సూటిపోటి మాటలు గునపాలై
గుండె లోతుల్లో గాయం చేస్తుంటే
మానవత్వం అనే మలాము
ఎక్కడ బందీఅయిందో కనిపిస్తలేదు
స్వార్ధాల ఊయలలో ఊగలేదు
వ్యసనాల మత్తులో తూగలేదు
సాయం అడిగినోల్లకి
అరచేతిని అందించిన
దు:ఖంలో ఉన్నోల్లతో
కన్నీళ్లను పంచుకున్న
చివరకి కష్టం నా తలుపు తట్టితే
తొంగి చూసేటోల్లు లేకపోతిరి
బాధల్లో కంట నీరు
తుడిచేటోల్లు కూడా కరువైతిరి
పర్వాలే మినుగురులా
చీకటిని కాల్చే నిప్పు రవ్వనైత
వీచే గాలికి
ఎదురు ఈది సవాలు చేసే
ధిక్కారపు పతాకానైత
– ఆకాష్ మునిగాల, 8106390647