మండలానికో బీసీ ఫంక్షన్ హల్ నిర్మించాలి

– మంత్రికి వినతి పత్రం అందజేసిన బీసీ సంఘం నాయకులు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్  నియోజకవర్గం లోని అన్ని మండల  కేంద్రం ల లో బీసీ ఫంక్షన్ హల్ లు నిర్మించాలని  సోమవారం హుస్నాబాద్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మంత్రి పోన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందజేశారు. హుస్నాబాద్ పట్టణంలో బీసీ భవన్, ఫంక్షన్ హాల్  స్టడీ సర్కిల్  భవనం ఏర్పాటు కోసం రెండు ఎకరాల భూమి, రూ.5 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. పట్టణ కల్లు గీత కార్మిక సంఘం కు 5 గంటల భూమి, రూ.20 లక్షల నిధులు కేటాయించాలని వినతి పత్రం లో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బి సి సంక్షేమ సంఘము నియోజకవర్గం కన్వినర్, తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘము రాష్ట్ర కమిటీ సభ్యులు  పచ్చిమట్ల రవీందర్ గౌడ్, హుస్నాబాద్ మండలం  యూత్ అధ్యక్షులు   గట్టు సాయి గౌడ్,  నాయకులు దుద్దెడ రాజేష్, పెరుమాండ్ల భరత్, వేణు తదితరులు పాల్గొన్నారు.