
మండలంలోని రెడ్డి పేట అడవిలో ఎలుగుబంటు మృతి చెందిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రెడ్డి పేట అడవి ప్రాంతమైన నందిబండ ఏరియాలో కోటిలింగాల వద్ద ఎలుగుబంటు గత నెల రెండు నెలల క్రితం మృతి చెందిన ఆనవాలు ఉన్నాయని, ఆహారం, నీరు దొరకక మృతి చెందిందా? ఎవరైనా చంపారా అనేది తెలియవలసి ఉంది. గత నెల రెండు నెలల నుండి మృతి చెందిన ఎలుగుబంటు ఆనవాలు ఉన్న, ఫారెస్ట్ అధికారులు గుర్తించకపోవడం గమనార్థం. వేసవిలో అడవి జంతువులకు నీరు అందించవలసిన బాధ్యత అడివి అధికారుల పై ఉన్న, నిధులు మంజూరు కాకపోవడంతో నీటిని అందించకపోవడంతో గ్రామ పొలిమేరలకు రావడం వంటి సమస్య , రావడంతో గ్రామాల ప్రజలు బయందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, అడవి జంతువులను సంరక్షించాలని, గ్రామాలకు రాకుండా నీటితోపాటు ఆహారాన్ని అందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.