అందమైన ప్రేమకథ

అందమైన ప్రేమకథరక్షిత్‌ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్‌ కంపెనీ, ఎస్‌.వి.ఎస్‌. స్టూడియోస్‌ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్‌ ఉబ్బర దర్శకత్వం వహించారు. ఈనెల 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పి సంస్థ దక్కించుకుంది. రీసెంట్‌ టైమ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన ఈ సంస్థ ఇప్పుడు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘ఓ మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన మా చిత్రాన్ని మైత్రి లాంటి సంస్థ పంపిణీ చేయడాన్ని తొలి విజయంగా భావిస్తున్నాం. గోదావరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథకి ప్రేక్షకులం దరూ కచ్చితంగా కనెక్ట్‌ అవుతారు. ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథలు వచ్చినప్పటికీ వాటితో పోలిస్తే ఇది చాలా భిన్నమైనది’ అని మేకర్స్‌ తెలిపారు. శ్రీమన్‌, దీపక్‌ ప్రిన్స్‌, జబర్దస్త్‌ బాబీ, రంగస్థలం మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సమర్పణ – గౌరీ నాయుడు, సినిమాటోగ్రాఫర్‌ – శ్రీసాయి కుమార్‌ దారా, సంగీతం – శరవణ వాసుదేవన్‌.