కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ‘ఉషా పరిణయం’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. కె.విజయ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్య తారలు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘తన్వీ ఆకాంక్షకు అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. విజయ్ భాస్కర్ దర్శకత్వలో నేను ‘ప్రేమకావాలి’ అనే సినిమా చేయాల్సింది. అది మిస్ అయ్యింది. కమల్ నాకు జిమ్‌లో పరిచయం మంచి హార్డ్‌వర్కర్. తను హీరోగా చేయడం హ్యపీగా ఉంది. ఆర్.ఆర్.ధ్రువన్ సంగీతం చాలా బాగుంటుంది. కొత్తవాళ్లతో చేస్తున్న ఈ సినిమాని థియేటర్‌కు వెళ్లి చూస్తే..ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి. విజయ్ భాస్కర్‌కి మంచి విజయం చేకూరాలి’ అని అన్నారు.