‘బేబీ’ చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట, ’90ర’ వెబ్ సిరీస్‌తో దర్శకుడు ఆదిత్య హాసన్ మంచి విజయాల్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ ముగ్గురితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ ప్రొడక్షన్ నెం.32ని ప్రకటించింది. ’90ర’ సిరీస్‌లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే. ఆ పిల్లవాడు పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఓ అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఎస్.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.