దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో ఆయన హీరోగా, దర్శకుడిగా మరోసారి తెలుగు ప్రేక్షకుల రాబోతున్నారు. ఇందులో విహాన్షి హెగ్డే, కతి వర్మలు హీరోయిన్లు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా, తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ఈ చిత్రం రాబోతోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ షెరాజ్ మెహదీ మాట్లాడుతూ, ఈ సినిమాకు భాష్యశ్రీ కథ, మాటలు, పాటలు రాశారు. అలాగే స్క్రీన్ ప్లేలో కూడా సపోర్ట్ చేశారు. ఇది గ్లామర్ బేస్డ్ మూవీ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఒకరకంగా ఇది ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ. మహిళలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. అలాగే మోసం చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ ఇంపార్టెంట్ రోల్స్‌లో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్స్‌లో మిమ్మల్ని కలుస్తాం’ అని అన్నారు. ‘సినిమా చాలా బాగా వచ్చింది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా స్ట్రాంగ్ స్క్రిప్ట్ మీద వెళ్లాం’ అని రైటర్ భాష్య శ్రీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరామెన్ : కావేటి ప్రవీణ్, ఎడిటర్: డివి ప్రభు.