ఊరి పాత్ర నేపథ్యంలో సాగే అందమైన పాట

         బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌లో వస్తోన్న 6వ చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఇచ్చట అందమైన ఫొటోస్‌ తీయబడును అనేది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వంలో చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన సినిమా. తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు సుహాస్‌ చేతుల మీదుగా మరో పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుహాస్‌ మాట్లాడుతూ, ‘నా చేతుల మీదుగా ఒక పాట విడుదల కావడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. పాట చాలా బావుంది. తక్కువ బడ్జెట్‌ అయినా.. హై క్వాలిటీ విజువల్స్‌ ఉన్నాయి. హీరో చైతన్య, చెందు ముద్దుతో పాటు నిర్మాత యష్‌కి మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాలో మొదటగా వచ్చే పాట ఇది. సినిమాలో ఊరికీ ఓ పాత్ర ఉంటుంది. ఆ ఊరి పాత్రను ఎస్టాబ్లిష్‌ చేస్తూ సాగే పాట ఇది. ఆ ఊరు ఎలాంటిది.. అక్కడి మనుషులు ఎలాంటివాళ్లు అనేది ఈ పాటలో కనిపిస్తుంది. ఈ పాటకు ప్రిన్స్‌ హెన్రీ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఆ ట్యూన్‌కు తగ్గట్టుగా మంచి లిరిక్స్‌ ఇచ్చాడు శ్రీనివాస్‌ మౌళి. పంకజ్‌ సినిమాటోగ్రఫీ చాలా బావుంది’ అని దర్శకుడు చెందు ముద్దు తెలిపారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రిన్స్‌ హెన్రీ మాట్లాడుతూ,’ఒక మంచి అవకాశం ఇచ్చిన ఎస్‌ఆర్‌కి థ్యాంక్యూ. మంచి విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండే పాట ఇది.అలాగని రెగ్యులర్‌ ఫోక్‌ సాంగ్‌లా ఉండదు. అందుకు తగ్గట్టుగా మౌళి మంచి సాహిత్యం రాశారు. సాయి చరణ్‌ అంతే బాగా పాడారు. అన్ని రకాలుగా ది బెస్ట్‌ ఇచ్చాం. మీరు విని ఎంజారు చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికే విడుదలైన రెండు పాటలను బాగా ఆదరించారు. అలాగే ఈ పాటని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ఈ వేసవిలోనే విడుదలకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.