కుష్టు వ్యాధి నివారణపై ఆశాల అవగాహన

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండలం కాచనపల్లి సబ్ సెంటర్ పరిధిలోని తిర్లాపురం గ్రామంలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం జరిగిందని స్థానిక సీఐటీయూ అనుబంధ ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు ఎస్.సుగుణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలో ప్రజలతో పాటు పాఠశాలలో విద్యార్థులకూ కుష్టు నివారణపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు చంద్రకళ, వి.కావేరి, సావిత్రి, విజయ లక్ష్మి, సునీత, బట్టు సావిత్రి, సుక్కమ్మ, శిరోమణి, రమణ, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.