
నవతెలంగాణ – గోవిందరావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వ హయాము లో రుణమాఫీ అనేది ఒక పెద్ద పండగ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కిసాన్ సెల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటకృష్ణ హాజరై పాలాభిషేకం చేసి ప్రజలతో మాట్లాడారు. మండలంలో ప్రస్తుతం లక్ష లోపు రుణమాఫీ విషయంలో 1086 చిన్న సన్న కారు రైతు కుటుంబాలకు సంబంధించిన 1458 మంది రైతులకు ఇప్పటివరకు 8,32,12,428/- రూపాయల రుణమాఫీ జరిగిందని అన్నారు. ఇప్పటినుండి మొదలుకొని ఆగస్టు 15 వరకు విడతల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. రుణమాఫీ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని రైతులకు ఎలాంటి సందేహాలు అనుమానాలు ఉన్న సంబంధిత బ్యాంకు అధికారులను గాని మండల వ్యవసాయ అధికారి నీ గాని సంబంధిత అధికారులను కానీ అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అవసరమైతే తాము కూడా రుణమాఫీ విషయంలో సహకరించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాల వ్యవధిలో ఇంత రుణమాఫీ చేయడం దేశవ్యాప్తంగా ఒక సంచలనమని అన్నారు. భారతదేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం రైతులకు పండగగా మారిందని అన్నారు. వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ హామీని ప్రభుత్వం నెరవేర్చి మాట నిలబెట్టుకుందని అన్నారు.
మాట ఇచ్చి మాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికె సాధ్యమని అన్నారు. గత ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల పరిపాలనలో చివరి సమయంలో రుణమాఫీకి పలుదపాలుగా ఇబ్బందులు పడి అరకొర గా అమలు చేయడం జరిగిందని అన్నారు. ఇచ్చిన హామీని సవాలుగా స్వీకరించిన ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ ఇచ్చి సంచలనం సృష్టించారని మళ్లీ రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఇస్తూ రైతాంగాన్ని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ రుణమాఫీ తో కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్స్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే చాలా వరకు అమలుపరిచిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 ల కే గ్యాస్ సబ్సిడీ కూడా నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి కూడా నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రతి పేద రైతు కుటుంబానికి లబ్ధి చేకూర్చి ఆర్థికంగా ఎదుగుదల సాధించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్ష కార్యదర్శులు గ్రామ కమిటీ అధ్యక్షులు మహిళా సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.