ఆర్డీవోకు ఘనంగా సన్మానం..

Great honor for RDO..నవతెలంగాణ – భువనగిరి
బదిలీపై వచ్చిన భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డికి గిరిజన నాయకులు శాలువలతో ఘనంగా  సత్కరించారు. సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోలు కలిసి సత్కరించిన సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తుర్కపల్లి మండల పరిధిలోని చోక్ల నాయక్ తండ వాసులు ప్రాజెక్టులో  భూమి కోల్పోయిన భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు.జిల్లాలో తుర్కపల్లి మండలం గిరిజనులు నిరుపేద కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమ లో భారతీయ జనతా పార్టీ తుర్కపల్లి మండలం అద్యక్షుడు. బాణోతు చత్రు నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్రా ప్రధాన కార్యదర్శి ధీరావత్ రాజేష్ నాయక్,చొక్ల నాయక్ తండ తాజమాజీ సర్పంచ్ భూక్యా రామోజీ నాయక్, మోతిరం తండ తాజా మాజీ సర్పంచ్ బానోతు బిచ్చు నాయక్, బానోత్ భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.