మద్నూర్ మండల నూతన ఎస్సైగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విజయ్ కొండకు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెత్కర్ సన్నిహితుడు ఎన్ ఎస్ యు ఐ డోంగ్లి మండల అధ్యక్షులు సుధీర్ కుమార్ శనివారం మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైకి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ సేవలు అమూల్యమైనవని, ప్రజా సమస్యల పరిష్కారానికి న్యాయపరంగా కృషి చేయాలని ఎస్సైని కోరారు. సన్మానించిన ఎన్ ఎస్ యు ఐ నాయకునికి ఎస్సై ధన్యవాదాలు తెలిపారు.