త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

A big risk missed in errorనవతెలంగాణ – ఆర్మూర్ 

నిర్మల్ నుండి నిజామాబాద్ వైపు వెళుతున్న టిఎస్ఆర్టిసి జిల్లా 2 డిపో బస్సు, డీసీఎం లు ఢీకొన్న సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కుక్కను తప్పించే క్రమంలో చిన్నాపూర్ గ్రామ జాతీయ రహదారిపై డీసీఎం డ్రైవర్ బ్రేకు వేయడంతో వెనక వస్తున్న బస్సు డ్రైవర్ బ్రేకు వేయగా వేగం అదుపు కాలేక బస్సు ముందర అద్దాలు ధ్వంసం అయినాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.