వైభవ్, సునీల్ లీడ్ రోల్స్‌లో ఓ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందు తోంది. ఇళంగో రామ్ దర్శకుడు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, బవేజ స్టూడియోస్ సమర్పణలో ఎస్ కార్తికేయన్, హర్మాన్ బవేజ, పి. హిరణ్య నిర్మిస్తు న్నారు. శశి నాగ్ సహ నిర్మాత. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి ‘పెద్ద’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ‘ఫన్ ఫ్యామిలీ ఫ్యూనరల్’ అనే ట్యాగ్‌తో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మరణించిన కుటుంబ పెద్ద చూట్టూ గుమిగూడిన కుటుంబం, వారి డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్లీ, దీపా శంకర్, బాల శరవన్ కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం:ఇళంగో రామ్, మ్యూజిక్: అరుణ్ రాజ్, డీవోపీ: సత్య తిలకం, ఎడిటర్: సూర్య కుమారగురు.