శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మత్తువదలరా2′. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈనెల 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులను అలరించి, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన బ్లాక్ బస్టర్ ప్రెస్‌మీట్‌లో హీరో శ్రీ సింహ మాట్లాడుతూ,’మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దాని కంటే సినిమా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. పార్ట్ 3 కోసం మీలానే నేనూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను’ అని తెలిపారు. డైరెక్టర్ రితిష్ రానా మాట్లాడుతూ, ‘సినిమా చూసి ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. ‘ఈ సినిమాని ఇంత పెద్ద స్థాయిలో ఆదరించిన ప్రేక్షకులందరికీ కతజ్ఞతలు. ప్రేక్షకులందరూ చాలా పెద్ద హిట్ చేశారు. మీడియా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు’ అని నిర్మాత చెర్రీ చెప్పారు. మరో నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ,’సినిమాని ఊహించిన దాని కంటే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’. దసరా సెలవుల్లో కూడా ఈ రన్ కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాం. ఇప్పటివరకు మొత్తంగా రూ.30.1 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది’ అని అన్నారు.