మహిళలు మాత్రమే యాత్ర చేస్తే ఎంత సంతోషంగా వురటురది… పక్షి స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరినంతగా. నిజంగానే ఇల్లూ, మొగుడూ, పిల్లలూ, సంసారం… రకరకాల ఇరుకుల నురచి బయటకు వచ్చి ప్రకృతిలో, మాతో మేం గడిపార. మొత్తరగా ఈ మూడు రోజులు ఇంట్లో, ఆఫీసులో వురడే ఏ ఆదేశాలూ, ఆజ్ఞల జారీలు లేవు. తుళ్లింతలు, కేరిరతలు… ఒకరికి ఒకరర చేయందిరచుకురటూ అలా సాగిపోయాం.
మనం మాత్రమే వురడటం ఇంత బాగురటురదా? మాకిరత వరకు తెలియదు. ఇక నురచి ఏ ప్రయాణం వున్నా చెప్పండి. తప్పక వస్తాం అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు. కొత్త ప్రపంచాన్ని చూశారు. మనం, మహిళలం ఇంత కన్‌స్ట్రక్టివ్‌గా ప్రయాణాలు చేయవచ్చా (నిజానికి మహిళలే కదా కన్‌స్ట్రక్టివ్‌గా ఉండేది) అని ఆశ్చర్యపోయారు. మొత్తానికి అరదరూ చిన్నపిల్లలయి పోయారు. మా మనసులకు రెక్కలు వచ్చి ‘విహంగ’లమై వీక్షిరచాం.
మా ఈ ప్రయాణం వైహెచ్‌ఏఐ (యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) మహిళా గ్రూప్ ‘విహంగ’తో మొదటిసారి ప్రారంభమైరది. ఈ ఏడాదే 100 మంది మహిళలతో ‘విహంగ’ గ్రూప్ ఏర్పడిరది. గతంలో కొరతమంది వైహెచ్‌ఏఐతో ప్రయాణిరచినవారు ఉన్నారు. అలాగే ఈసారి సగానికి పైగా కొత్తగా జాయినవారు వచ్చారు.
37 మంది మహిళలతో 3 పగళ్లు, 2 రాత్రులు మా యాత్ర సాగిరది.
30 సెప్టెంబర్, 2023న వేకువ జామున మా బస్సు ప్రారంభమైరది. వెరటనే తలా ఒక టిఫిన్ ప్యాకెట్ ఇచ్చారు. తర్వాత అరత్యాక్షరి పాటలు, డ్యాన్సులతో బస్సు ఉదయం 11 గంటల వరకు పాకాల వైల్డ్ లైఫ్ సాంచురీ చేరుకురది (ఒక్కొక్కరికి రూ.40 టికెట్). కట్ట మీదుగా లోపలికి వెళ్లగానే కుడివైపు కనువిరదు చేసే పాకాల చెరువు. సముద్రాన్ని తలపిరచేలా కనుచూపు మేర నీరు. నీటి మధ్యలో పచ్చని గుట్టలు. కట్టకు కుడివైపు కిరదికి దిగితే పారుతున్న కాలువ. ఈ కాలువలో స్నానం చెయ్యవచ్చు. సీతాకోకచిలుకల పార్కు, ఆట స్థలాలు. సమయం తెలియకురడా గడిచిపోయిరది. ఇక్కడ మేం కొన్ని గంటలు మాత్రమే వున్నాం కానీ వంట చేసుకుని తిని, తీరిగ్గా ఒక రోజంతా గడపవచ్చు. సరుకులు, గ్యాస్ వెరట తెచ్చుకురటే వండుకోవడానికి ఏర్పాట్లు వున్నాయి.
ఇక్కడి నురచి బయలుదేరి వెళ్లి హరిత ఘట్టమ్మ రిసార్ట్‌లో లంచ్ చేసాం. ఇరదులో రీజనబుల్ ధరతో పాటు భోజనం బాగురది.
ఆ తర్వాత సీదా తాడ్వాయి ఫెరియాడో రిసార్ట్‌కి వెళ్లాం (ఇది గతంలో హరిత రిసార్ట్. కానీ ప్రస్తుతం లీజ్‌కి ఇచ్చారు). అప్పటికే సాయంత్రమైరది. జనరల్‌గా రూంకి ఇద్దరు కానీ మేం ఎక్స్‌ట్రా బెడ్ వేయిరచుకుని, దానికి ఎక్స్‌ట్రా పే చేశాం. రూములు నీట్‌గా ఉన్నాయి. సర్వీస్ కూడా బాగురది. కాకపోతే వీకెండ్స్‌లో ఎక్కువ రేటు చెప్తున్నారు. ఇక్కడ ఐడి ప్రూఫ్ తప్పనిసరి. ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదా ఏదేని ఒక ఐడి జిరాక్స్ తప్పక తీసుకెళ్లాలి.
ఈ రిసార్ట్ అడవి మధ్యలో వురది. పరిసరాలు చిక్కటి చెట్లు, గుట్టలతో మనసుకు హాయిగా చాలా బాగురది. ఈ రిసార్ట్‌లో కనీసం రెరడు రోజులు ఉండాలి. రిసార్ట్‌కి 2 కి.మీ దూరంలో 5వేల సంవత్సరాల క్రితం నాటి డోలమైన్ సమాధులు ఉన్నాయని రిసెప్షన్ దగ్గర బోర్డుపై రాసి పెట్టారు. అలాగే ఈ రిసార్ట్‌కి దగ్గరలో చూడదగిన ప్రారతాల లిస్ట్ రాసారు. కాకపోతే, మా ప్రయాణంలో అవి లేవు. అక్కడికి వెళ్లాకే తెలిసిరది.
తర్వాత ఎవరి రూంల్లోకి వాళ్లం వెళ్లి ఫ్రెషప్ అయ్యి, సాయంత్రం 6.30 కల్లా బస్ ఎక్కి సమ్మక్క, సారలమ్మ గుడికి వెళ్లాం. నేను చాలా కాలంగా చూడాలి అనుకుంటున్నప్పటికీ వెళ్లలేకపోయాను. ఇలా సాధ్యమైరది. దేవుడు, దయ్యం మీద నమ్మకాలేమీ లేవు. కానీ వీరవనితలను ఆరాధిస్తున్న ప్రదేశం కదా. అప్పటికే చీకటిపడిరది. గుడి తప్ప బయట ఎక్కడా తిరగలేదు మేర. ఇక్కడ రూ.40, రూ.100 బంగారం (బెల్లం గడ్డలు) కొనుక్కున్నవారు సమ్మక్క, సారలమ్మలకు శాస్త్రానికి కొరత సమర్పిరచి, మిగతాది వాపస్ తెచ్చుకున్నారు. తిరిగి రిసార్ట్‌కి చేరుకునేసరికి రాత్రి దాదాపు 9 కావచ్చిరది. డిన్నర్ చేసి రూముల్లో దూరిపోయాం. అయితే ఈ ఫెరియాడో రిసార్ట్‌లో అన్నీ విపరీతమైన ధరల్లో వున్నాయి. ఉప్మా ధర రూ.70. ఒక్క పుల్కా రూ.25. ఏ కూర అయినా రూ.270.
పొద్దున 6.30 వరకల్లా స్టార్ట్ అవుతామని, 6.15 కల్లా బస్ దగ్గరికి చేరుకోవాలని మా టీమ్ లీడర్ వజ్రేశ్వరి రాత్రే చెప్పిరది. అరతేకాక ఎప్పటికప్పుడు వాట్సప్ గ్రూప్‌లోనూ పోస్టు పెడుతూ గైడ్ చేస్తురడేది.
అక్టోబర్ 1న అనుకున్న సమయానికి అరదరం లగేజీలతో సహా బస్సు దగ్గరికి చేరాం. రిసార్ట్‌లో ధర ఎక్కువగా వురడటం వల్ల అక్కడ ఒకరిని ఫోన్ నంబర్ తీసుకుని టిఫిన్ కోసం బయట ఆర్డర్ చేశాం. ఆర్డర్ తీసుకున్న వ్యక్తి ఉదయం 6.30 కల్లా (రెరడు ఇడ్లీ, రెరడు వడ రూ.40) టిఫిన్స్ తీసుకుని వచ్చాడు. రిసార్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత బస్సు బయలుదేరిరది. వెరటనే తలా ఒక టిఫిన్ ప్యాకెట్ అరదిరచారు. బస్సు నడుస్తురడగానే తిన్నాం. ఇంత వివరణకు కారణం… మాకు టైమ్ వేస్ట్ కాలేదని చెప్పడానికి. కొరగల వాటర్‌ఫాల్స్ వున్న జగన్నాథపురం చేరుకున్నాం. ఇది ఒక ఆదివాసీ పల్లె. బస్సు దిగి అక్కడ నురచి దాదాపు ఓ కిలోమీటరు వరకు నడిచాం. కొద్ది దూరం పొలాల మీదుగా, ఆ తర్వాత రెరడు వాగులు దాటి (నీళ్లు మోకాళ్ల వరకు కూడా లేవు), కొరత అడవిలో నడిచాం. ఆ తర్వాత వాటర్ ఫాల్ నీటి వెరట రాళ్ల మీదుగా నడవాల్సి వచ్చిరది. ఇక్కడ మాత్రం పెద్దవారికి కొద్దిగా ఇబ్బందిగా వురడిరది. సాధ్యమైనంత వరకు నడిచిన డా||సమతారోష్ని, నీతా గులాటి వాటర్‌ఫాల్ నీటిలో సరదాగా గడిపారు. చాలామందిమి వాటర్‌ఫాల్ వరకు చేరుకున్నాం. కొరతమంది వాటర్‌ఫాల్ పాదభాగం వరకు వెళ్లారు.
తెల్లటి పాలధార లారటి నీళ్లు గుట్ట మీదు నురచి దుముకుతూ కిరదపడుతున్నాయి. కిరద నీలం, ఆకుపచ్చరంగులో నీటి గురడం. అక్కడ నురచి పారుతున్న నీటి ప్రవాహం. నీటి సవ్వడి తప్ప మరే శబ్దమూ లేదు. చుట్టూ పెట్టని కోటవలె గుట్ట. పడుతున్న లేలేత కిరణాలు. పెద్దలందరూ పిల్లలయిపోయారు. ఒకటే కోరింతలు. నిజంగా అప్పుడు అక్కడ… నీళ్లు, మేం తప్ప మరే ఆలోచనా ఎవ్వరి మనసుల్లో లేకురడె. ప్రకృతి ఒడిలో కొన్ని గంటలపాటు సేదతీరాం. మధ్యాహ్నం 12.30 గంటలకు అరదరర తిరుగుముఖం పట్టాం.
కొరగల వాటర్‌ఫాల్స్ ఇంకా ఫేమస్ కాకపోవడం వల్ల జనం ఎక్కువగా లేరు. ఇప్పటికే అక్కడ పొల్యూషన్ మొదలైరది. తాగిన మందు బాటిళ్లను కొట్టి వాటర్‌లో వేసారు. మాలో ఇద్దరికి ఆ గాజు పెరకులు గుచ్చుకున్నాయి. మందుసీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు బాగానే కనిపిరచాయి. జనం పెరిగితే ఇంకెరత వ్యర్థాలు పెరుగుతాయో తెలియదు. ప్రతి ఒక్కరూ ఇలా వ్యర్థాలను వేస్తూ పోతే భవిష్యత్‌లో ఆ ప్రారతం ఏ తీరుగా తయారవుతుందన్న స్పృహ వురడటం లేదు అక్కడకు వచ్చే పర్యాటకులకు. బొగత వాటర్ ఫాల్స్ దగ్గర మరీ ఘోరం… డైపర్స్‌ను ఒడ్డునే పడేసారు.
కొరగల వాటర్‌ఫాల్స్‌కి వెళ్లేటప్పుడే జగన్నాథపురం ఊర్లో బస్సును ఆపుకుని, ఓ ఇంటతని దగ్గర ఫోన్ నంబర్ తీసుకుని, స్థానికంగా వున్న ఆ చిన్న హోటల్‌లో డ్రైవర్‌తో కలిపి మా 38 మందికి భోజనం ఆర్డర్ చేశాం. మురదే ఆర్డర్ చెయ్యకపోతే ఇంతమందికి ఒకేసారి భోజనం లభిరచడం కష్టమయ్యేది. ముఖ్యరగా చాలా సమయం వేస్ట్ అయ్యేది. ఆర్డర్ చేసిన హోటల్‌కు మధ్యాహ్నం 1.30 వరకు చేరుకున్నాం. ట్విస్ట్ ఏమంటే అతను ఇంకా భోజనం తయారు చెయ్యలేదు. మా కోసం వండిన దానిని వేరే కస్టమర్లకు పెట్టాడు. మా కోసం సరుకులు తీసుకురావడానికి ములుగుకు వెళ్లినవారికి యాక్సిడెరట్ అయిరదట. దానికితోడు గ్యాస్ అయిపోయిరదట. మేం వెళ్లి వంటలో వారికి సాయం చేసి, వండుకుని తిని బయలుదేరేసరికి దాదాపు మధ్యాహ్నం 3.30 గంటలు దాటిరది. ఇక్కడ దాదాపు గరటన్నర టైమ్ వేస్ట్ అయ్యిరది.
ఇక్కడి నుంచి నేరుగా బొగత వాటర్ ఫాల్స్‌కి వెళ్లాం. ఆదివారం అవ్వడం వల్ల రద్దీ ఎక్కువగా వురది. వాటర్ ఫాల్ దగ్గరి వరకు వెళ్లకురడా ఇనుప రాడ్లతో అడ్డరగా కంచె వేసి వురది. పక్కనే వున్న నీటిలో విపరీతమైన జనం. నీరంతా మురికి. అక్కడి విపరీతమైన హ్యుమిడీ, ఉక్కను తట్టుకోలేక మాలో కొరదరం ఆ మురికి నీళ్లలోకి దిగాం. చాలామంది బయటే వురడిపోయారు. పక్కనే గుట్టపైన ఒక గుడి వురది. ప్రభుత్వర ఇక్కడ కొరత డెవలప్ చేసిరది. నడవలేని వారు అయినా పర్మిషన్ తీసుకుని వెహికిల్‌లో వాటర్‌ఫాల్ దగ్గరి వరకు వెళ్లవచ్చు.
సాయంత్రం 5.30 గంటలకల్లా ఇక్కడి నురచి బొగత ఫెరియాడో రిసార్ట్‌కి చేరుకున్నాం. గోదావరి నది పక్కనే ఆహ్లాదకర వాతావరణంలో ఈ రిసార్ట్ వురది.
ఫ్రెషప్ అయ్యి రిసెప్షన్ దగ్గర వున్న కిచెన్ దగ్గరికి వచ్చాం. మధ్యాహ్నం వడ్డిరచుకుని తెచ్చిన ఫ్రైడ్ రైస్‌ను ఆ రాత్రి డిన్నర్‌గా తిని, రిసెప్షన్ మెట్ల మీద కూర్చున్నాం (ఇక్కడ మీల్స్ వండరు. చైనీస్ ఫుడ్ చేస్తారట. కానీ అవి దొరకలేదు మాకు. పెరుగు వురదని చెప్పిన అక్కడి వుద్యోగులు చివరి నిమిషంలో లేదని చెప్పారు). డ్యాన్స్ వేద్దామని అరటున్నారు కానీ ఎవరూ మురదుకు రాకపోవడంతో గుత్తా జ్యోత్స్న నిలబడ్డచోటే డ్యాన్స్ మొదలుపెట్టిరది. ఉదయశ్రీ, మాధవి, ప్రసూన, సునంద, శివకుమారి, యశోద రంగంలోకి దిగారు. డిజే టిల్లు, నర్సపల్లీ గండిలోన గంగదారి ఆడినెమలి ఆటాలకు గంగదారి తదితర పాటలకు డ్యాన్స్‌లు, ఈలలు. డాక్టర్ సమతకు ఊపు వచ్చి తనూ స్టెప్ కలిపిరది. ఈలోగా చిన్నారి వచ్చి రెరడు పాటలకు సంప్రదాయ నృత్యర చేసిరది.
అక్టోబర్ 2న పొద్దుట 7 గంటలకు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హేమాచల లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి బయలుదేరాం. ఈ గుడికి వెళ్లే దారిలో వున్న కమలాపురం గ్రామంలో టిఫిన్‌కి ఆర్డర్ చేశాం. ఈ గుడిలోని విగ్రహాన్ని ఎక్కడ నొక్కినా.. నొక్కుపడి అక్కడ నురచి ఎర్రగా కారుతోరది. రెరడుమూడు చోట నొక్కి చూపిరచారు పూజారి. పైన దోవతి చుట్టడం వల్ల లోపల ఏమున్నది తెలియడం లేదు. అది ఏమైనా ఏర్పాటేమో అనుకున్నాను. కానీ శని, ఆదివారాల్లో నిజ దర్శనం ఉంటుందని ఆ రోజు కూడా నొక్కితే లోపలికి పోయి, ఎర్రని ద్రవం కారుతురదని అక్కడివారు చెప్పారు. శిల మానవ శరీరంలా మెత్తగా ఉండటమనేది విచిత్రంగా అనిపిరచిరది. ఎందుకనో గుడిలో లైట్ లేదు. దీపం వెలుతురులో విగ్రహమే సరిగా కనిపిరచలేదు.
ఈ గుడికి 4వేల సంవత్సరాల చరిత్ర వురదని, ఈ విగ్రహ నాభిలోంచి చీము లారటి తెల్లటి ద్రవం కారుతుందని, శరీరమంతా రోమాలు ఉంటాయని పూజారి చెప్పారు. యేటా జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది జనాభా వస్తారని, ఇక్కడ గుట్ట కిరది భాగంలో వున్న చిరతామణి జలధారలోని నీరు మూలికాపరమైనదని, తాగితే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. ఇక్కడ కాకతీయుల సైనిక స్థావరం వురడేదని, ఒకసారి రాణి రుద్రమదేవి అనారోగ్యానికి గురైనప్పుడు ఈ నీటినే తాగిరదని, ‘చిరతామణి’ అనే పేరును ఆవిడే పెట్టిరదని అక్కడి షాపులవాళ్లు చెప్పారు. సరే, అరదరూ వెళితే లేట్ అవుతురదని మా టీమ్ ‘బాహుబలి’ యోగా టీచర్ దివ్య 20 లీటర్ల క్యాన్ పట్టుకుని పరుగున వెళ్లి, పరుగున నీటిని తెచ్చిరది. దివ్య, లాయర్ శ్రావ్య మా యాత్ర జరిగిన ఆ మూడు రోజులు అన్ని పనుల్లో మురదున్నారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకున్నారు.
నిజానికి ఇక్కడ కూడా ఉదయం నురచి సాయంత్రం వరకు గడపవచ్చు. అక్కడే వున్న గుట్ట మీదకి ట్రెక్కిరగ్‌కి వెళ్లవచ్చు. ఇక్కడి గుట్టమీద రాళ్లతో నిర్మిరచిన పురాతన (కాకతీయుల) కాలం నాటి సమాధులున్నాయట. మా షెడ్యూల్‌లో ఇవి లేవు. అరత సమయమూ మాకు లేదు.
ఇక్కడి నురచి బయలుదేరి లక్నవరం లేక్‌కు మధ్యాహ్యానికి చేరుకున్నాం. ఇది కూడా సముద్రాన్ని తలపిస్తురది. నీళ్ల మధ్యలో అక్కడక్కడా దీవులున్నాయి. వేలాడే బ్రిడ్జి మీదుగా ఒక దీవికి చేరుకున్నాం. ఇక్కడ హోటల్ వురది. నీటిని చూస్తూ ఎంతసేపైనా ఇక్కడ గడపవచ్చు. మరో దీవిలో వున్న హరిత రిసార్ట్‌కి ఇక్కడి నురచి బోట్‌లో వెళ్లాల్సి వురటురది. మాలో కొరత మంది టికెట్ కొనుక్కుని బోట్‌లో నీళ్లలో ఓ రౌండ్ వేసి వచ్చారు.
ఇక్కడి నురచి మా మార్గమధ్యరలో వున్న ఇంచెర్ల హరిత రిసార్ట్‌లో లంచ్ చేసుకుని, రామప్ప గుడికి వెళ్లాం. ఇక్కడి గర్భగుడి ద్వారానికి ఎడమపక్కన కృష్ణుడి విగ్రహాన్ని అల్లుకుని వున్న తీగ (శిల)ను కొడితే సరిగమలు పలుకుతున్నాయి. ఈ రామప్ప టెరపుల్‌లో చాలా విశేషాలున్నాయి. సూర్యకిరణాలు పరావర్తనం చెరది శివలింగంపై పడడం వల్ల సూర్యుడున్నరతసేపు గర్భగుడిలో వెలుతురు వురడటం మరో ప్రత్యేకత. అలాగే భూకంపాలు వచ్చినా కూలిపోకురడా ఆలయాన్ని నిర్మిరచారట. భూకంపాల వల్ల ఆలయంలో నేలన వున్న రాతి ఫలకాలు చెదిరివున్నాయి. ప్రతి స్తంభం మీద చక్కటి శిల్పాలు చెక్కి వున్నాయి. అరతేకాదు, అరతరిరచిపోయిన పేరిణీ నృత్యాన్ని ఇక్కడ చెక్కిన శిల్పాల ఆధారంగా మళ్లీ కూర్చారట. ఈ ఆలయాన్ని నీటిలో వేస్తే తేలియాడే ఇటుకలతో నిర్మిరచారు. మరో ముఖ్యవిషయం, ఇక్కడి నంది ఎటు తిరిగినా అది మనల్నే చూస్తున్నట్టుగా వురటురది.
ఆలయం చుట్టూ వున్న సాలభంజికలు ఎంత అరదంగా వున్నాయో! కాకతీయుల కాలంనాటి అరటే వందల ఏండ్ల కిరద చెక్కిన ఈ విగ్రహాలు ఇప్పటికీ మిలమిలా మెరుస్తూ వున్నాయి. చేతిలో బాణం పట్టుకుని వున్న వీరవనిత అరికాలుకు విరిగిన ముల్లును తీస్తున్న వ్యక్తి… అరికాలుకు ముల్లు విరగడం వల్ల వచ్చిన వాపును కూడా విగ్రహంలో చూపిరచారు. ఒక సాలభంజిక హైహీల్స్ చెప్పులు వున్నాయి. ఒక సాలభంజిక మెడలోని హారం నీడ ఆమె పొట్ట మీద పడుతురది. ఆ నీడను కూడా స్పష్టరగా చెక్కారు. ముస్లింల దండయాత్రలో ఈ సాలభంజికలన్నీ ధ్వంసంకాగా ఒక్కటి మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకురడా వురది. మరొక ముఖ్యమైన విషయం… శిల్పి రామప్ప పేరే ఆలయానికి పెట్టారు. ”ఇది రామప్ప ఆలయం కదా. రాముడి విగ్రహానికి బదులు శివలింగం వురదేమిటి?” అని ఒకావిడ నన్ను అడిగిరది. నాకు తెలిసిన పై విషయాన్ని ఆమెకు చెప్పాను. రామప్ప ఆలయ విశేషాలతో ప్రత్యేకంగా ఒక వ్యాసమే రాయవచ్చు.
మాలో కొద్దిమంది మొదటిసారి రామప్ప ఆలయాన్ని సందర్శించిన వారు… అబ్బురానికి లోనయ్యారు. ప్రతిచోటా ఫొటోలు తీసుకున్నారు. ఈ ఆలయాన్ని, పరిసరాలను, దగ్గరలోని రామప్ప చెరువును, చెరువు దగ్గరలో ధ్వరసమైన ఆలయాన్ని… ఇవన్నీ సందర్శించాలంటే ఒక రోజంతా గడపాలి. మా చివరి మజిలీ అయిన పాండవులగుట్టను ఇంకా సందర్శించాల్సి వురడటంతో గంటన్నర లోపలే బయటపడ్డాం. రామప్ప చెరువును చూడలేకపోయాం.
ఇక్కడి నురచి పారడవులగుట్టకు గేట్లు మూయడానికి కొద్దిగా మురదు చేరుకున్నాం. ఇది ట్రెక్కిరగ్. ఎక్కలేనివారు కొరదరు కిరదనే వురడిపోయారు. గుట్ట ఎక్కాక… అక్కడ మరో ప్రపంచం! అతి పెద్దవైన రాళ్లు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిలాకృతులు. గుట్ట మీద నురచి అస్తమిస్తున్న సూర్యున్ని చూడటం అద్భుతంగా అనిపిరచిరది. గుత్తా జోత్స్న మా అరదరితో పాటు గుట్ట ఎక్కారు, దిగారు. విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడే సావిత్రి ఉత్సాహంలో నొప్పులన్నీ మర్చిపోయి గుట్ట ఎక్కేసిరది. అప్పటికే చీకటి పడుతురడటంతో కొరతదూరం వరకే వెళ్లి తిరిగి వచ్చాం. కానీ ఈ గుట్ట కూడా ఒకరోజంతా వురడి తీరిగ్గా చూడాల్సిన ప్రారతం. గతంలో వెళ్లినప్పుడూ పూర్తిగా చూడలేకపోయాను. ఇప్పుడూ చూడలేకపోయాను. ఇక్కడో గమ్మత్తు జరిగిరది. ఓ నలుగురు అమ్మాయిలు మమ్మల్ని వాపస్ వెళ్లమని చెప్పి, వాళ్లు మరికొరత లోపలికి వెళ్లారు. టర్నిరగ్‌ల దగ్గర తప్పిపోయే అవకాశం వురదని, ఆ మలుపుల్లో విరిచిన కొమ్మలను వేస్తూ వచ్చాను. నిజంగా కన్‌ఫ్యూజ్ అయ్యి మురదరికి వెళ్లి, మళ్లీ వెనక్కి తిరిగి నేను వేసిన కొమ్మలను చూస్తూ వచ్చి మమ్మల్ని కలిసారు.
స్నేహితురాలు తప్పిపోయిందేమో కంగారుపడిన కసిరెడ్డి మంజులావాణి, చెప్పకురడా పోయినందుకు బాధపడిన సరళ, స్వచ్ఛమైన మనసున్న సృజన, తక్కువగా మాట్లాడుతూ ప్రకృతిని ఆస్వాదిరచిన అరుణ, ప్రతీదీ కెమెరాలో బంధించిన భారతి, నీతా; ఏ ఒక్క మాటా మాట్లాడని స్వర్ణలత, నీళ్లల్లో చిన్నపిల్లలైపోయిన భాగ్య, జయశ్రీ, పద్మావతి, సునంద, గుంభనంగా వురటూ స్నేహపూరితంగా మెదిలిన అరజలి, అరిపాదాల్లో నొప్పులతో అయినా అన్నిరట్లో పాల్గొన్న బోడపాటి పద్మావతి, పెద్దవయస్కురాలు విజయలక్ష్మి, అక్క చెల్లెళ్లా వున్న తల్లీకూతుర్లు త్రిష, తనీషలు; భండారు విజయ, సంధ్యారాణి, మంజులావాణి, భాగ్యశ్రీ, ప్రసూన, కవితలు… యాత్రలో భాగమయ్యారు.
ఇక్కడి నురచి హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యాం. ఒంగోలు నురచి యాత్రకు వచ్చిన కారతిని వరంగల్‌లో రైల్వేస్టేషన్‌కి వెళ్లడానికి (మధ్యలో ఓచోట దిగి) ఏర్పాట్లు చేశాం. బస్సులో వెనకాల కూర్చున్న వాళ్లు అరత్యాక్షరి పాటలు, అడవి విశేషాలు, ప్రస్తుత యాత్ర కబుర్లతో గడిపారు.
37 మంది మహిళలు… చాలా క్రమశిక్షణతో మెలిగారు. చెప్పిన సూచనలను, టైమ్‌ను ఫాలో అయ్యారు. అరదువల్లనే పెద్దగా ఇబ్బందులు లేకురడా, సమయం వృథా కాకురడా టూర్ ప్రశారతంగా ముగిసిరది. మూడు జుట్లేం ఖర్మం 3వేల జుట్లు అయినా కలిసే వురటాయి.
– తాయమ్మ కరుణ, 9010201880