
మండలంలో గత కొద్ది రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రిపూట కొద్దిపాటి చలి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున పుడమి మంచు దుప్పట్లు కప్పుకుంది. సూర్యుడు మేఘాల అమ్మ కొంగు చాటున దాక్కున్నాడు. పక్షులు, పువ్వులు బాల భానుడికై ఎదురుచూస్తూ చెట్లను కదలనివ్వలేదు. దీంతో ఉషోదయాన మంచు దుప్పటి పుడమిని కప్పేయడంతో భానుడి రాక ఆలస్యమై ప్రజలు కొద్దిపాటి ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు మంచులో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనబడక, లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు మాత్రం తన ఉనికి కోసం పనుల ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఉదయం 8 గంటల తర్వాత భానుడు తన దర్శనాన్ని కల్పించాడు.