అంధుడు సింగర్‌ రవి కుటుంబాన్ని ఆదుకోవాలి

– ప్రజాసంఘాల నాయకులు మోటమరి జనార్ధన్‌
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
జగిత్యాల జిల్లా మెడిపల్లి మండలాని కి చెందిన అంధుడు సింగర్‌ రవి కుటుం బాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజాసం ఘాల నాయకులు మోటమరి జనార్ధన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగర్‌ రవికి కండ్లు పూర్తిగా కనిపించ వని అన్నారు. అతని తమ్ముడు గంగాధర్‌ కూడా అంధు డే అన్నారు. వీరి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని తెలిపారు. తల్లి కా యకష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తోందని తెలిపారు. సింగర్‌ రవి కొం డగట్టు అంజనేయ స్వామి దేవాలయం దగ్గర భిక్షాటన చేస్తున్నాడని పేర్కొన్నారు. అక్కడ వచ్చిన డబ్బుతో ఆ కుటుంబం బతుకుతుందన్నారు. రవి కుటుంబం దయనీయ స్థితిలో ఉందన్నారు. రవి కుటుంబం గురించి స్థానిక సర్పంచ్‌ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నా రు. రవికి కేవలం ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్‌ మాత్రమే వస్తుంద న్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏ ఇతర సదుపాయం అందడం లేదన్నారు. ప్రభుత్వం మానవత దృక్పథంతో ఆలోచించి రవి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరారు.