ఎగిసిన వాణిజ్య లోటు

– మేలో 22 బిలియన్‌ డాలర్లుగా నమోదు
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్‌ లో భారత సరకులకు డిమాండ్‌ పడిపోతోంది. వరుసగా నాలుగు నెలలుగా ఎగుమతులు డీలాపడ్డా యి. ఎగుమతులు తగ్గడం, మరో వైపు దిగుమతులు ఎక్కువగా జరు గుతున్నాయి. తద్వారా వాణిజ్య లోటు ఎగిసిపడుతోంది. ప్రస్తుత ఏడాది మేలో భారత సరుకుల వాణిజ్య లోటు 22.12 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకుందని గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణంకాలు వెల్లడిం చింది. 2022 డిసెంబర్‌ తర్వాత ఇంత గరిష్ట స్థాయిలో లోటు చోటు చేసుకో వడం ఇదే తొలిసారి. గడిచిన ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 15.24 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కాగా.. గతేడాది డిసెంబర్‌లో గరిష్టంగా 23.76 బిలియన్ల లోటు చోటు చేసుకుంది. 2023లో తొలిసారి మేలో అత్యధికంగా నమోద య్యింది. వరుసగా నాలుగు నెలలుగా ఎగుమతులు పడిపోవడం ఆందోళనా కరం. గడిచిన మే నెలలో దిగుమతులు 6.6 శాతం తగ్గి 57.1 బిలియన్లుగా, ఎగుమతులు 10.3 శాతం తగ్గి 34.98 బిలియన్లుగా చోటు చేసుకుంది. ” అభివృద్థి చెందిన అనేక దేశాల్లో మందగమనం చోటు చేసుకుంటుంది. జిడిపి కూడా పడిపోతోంది. ఇదే క్రమంలో వరుసగా దిగుమతులకు డిమాండ్‌ తగ్గుతోంది.” అని వాణిజ్య శాఖ సెక్రటరీ సునీల్‌ బరత్వాల్‌ పేర్కొన్నారు. పస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ – మే కాలంలో సరుకుల ఉత్పత్తులు, సేవల వాణిజ్య లోటు 13.28 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకోగా.. గతేడాది ఇదే కాలంలో 20.56 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.