నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం నీలా గ్రామంలోని రెవెన్యూ కార్యాలయం గత కొన్ని రోజులుగా నిరుపయోగంగా మారడంతో అది ప్రస్తుతం శిథిలఅవస్థకు చేరుకుంది. కార్యాలయం ఆవరణలో రైతులు తమ ట్రాక్టర్ సామాన్లను భద్రపరచుకున్నారు. గతంలో రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ, తో పాటు వీఆర్వోలు స్థానికంగా ఉంటూ రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేవారు. ప్రస్తుతం తాసిల్దార్ కార్యాలయంలోని వారు తమ విధులు నిర్వర్తిస్తూ ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ కార్యాలయాలు ఖాళీగా ఏర్పడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు కబ్జాకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.