అర్జీయూకేటీలో విద్యార్థి రచించిన పుస్తకవిష్కరణ..

నవతెలంగాణ -ముధోల్ : ఆర్జీయూకేటీ బాసర పియుసి 2 చదువుతున్న బానోతు మోహన్ రచించిన ద పీరియడ్ ఆఫ్ 2024  పుస్తకాన్ని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ పుస్తక సహా రచయితలుగా కే  హేమన్,  అజ్మీర చరణ్,  ఎన్ శశివర్ధన్  పుస్తక రచనలో  సహాయ సహకారాలు అందించారు.  వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ విద్యార్థులను  అభినందించారు. గొప్ప సంకల్పంతో పుస్తక రచన చేయడం అరుదైన విషయమని ఆయన అన్నారు . ఈ పుస్తకంలో ప్రధానంగా 2024 లో జరిగిన ప్రధానమైన ఘట్టాలు,  విశేషాంశాలు,  అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ,  క్రీడా బిజినెస్  రంగాలు,  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ,  ఎంటర్టైన్మెంట్  అంశాలతో రచించడం  గొప్ప ఆలోచన విధానమని  ఆయన కొనియాడారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ప్రతిభా నైపుణ్యాలు అత్యంత అద్భుతమైనవని  పేర్కొన్నారు .విద్యార్థుల ఆలోచనలకు అధ్యాపక ఉద్యోగ వర్గం  సహకారం అందిస్తే  సృజనాత్మకతకు  లోటుండదని  చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఓఎస్డి ప్రొఫెసర్ మురళీధర్, ఇంచార్జి నాగరాజు, అసోసియేటెడ్  డీన్స్, ఆధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.