సావిత్రి బాయి బాటలో పుస్తక నడక..

Book walk on the path of Savitri Bai..– గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థినుల వినూత్న ప్రదర్శన
– పుస్తక నడకను ప్రారంభించిన జడ్జీలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం నాడు కళాశాల చెందిన విద్యార్థులు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి ప్రాంగణం నుండి పులాంగ్ చౌరస్తా వరకు చేతిలో *పుస్తక నడక* నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి, ప్రిన్సిపల్ సెషన్ కోర్టు జడ్జి సునీత ఈ ర్యాలీని ప్రారంభించారు. దారి పొడువునా విద్యార్థినులు నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. పుస్తక ప్రాముఖ్యతను వివరించే ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ర్యాలీ జిల్లా జడ్జిల ప్రశంసలు అందుకుంది.
మహిళలకు అక్షరాలు నేర్పింది సావిత్రిబాయి పూలేనే సీనియర్ సివిల్ జడ్జీ పద్మావతి మహిళా సమాజానికి విద్యను హక్కుగా అందించడంలో సావిత్రిబాయి పూలె చేసిన కృషి అజరామరమని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జీ పద్మావతి కొనియాడారు. సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు చదువుల్లో ముందుకు రావాలన్నారు. ఆమె జయంతిని పురస్కరించుకొని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు పుస్తక నడక కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. పుస్తక పఠనం ద్వారా మహిళల సాధ్యమవుతుందని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జీ పద్మావతి పేర్కొన్నారు. సమాజంలో ఆధునిక పద్ధతుల ద్వారా విద్యా బోధన జరుగుతున్నప్పటికీ పుస్తకాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్, కళాశాల పబ్లిసిటీ కన్వీనర్ సుధాసింధు, అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు.