కార్పొరేట్ వర్గాలకు వరాలు.. పేదలకు భారాలు: నెల్లికంటి సత్యం

Boons for corporates. Burdens for the poor: Nellikanti's truthనవతెలంగాణ – మునుగోడు
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు రాయితీ లు ఇస్తూ పేదలు విద్య వైద్యము ఎరువుల సబ్సిడీలు కోతలు విధిస్తూ  పేదల సంక్షేమానికి కోతలు విధిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సీసీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సీసీఐ కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ  మండల కార్యదర్శులు ప్రజా సంఘాల సమావేశంలో నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ..వికసిత్ భారత్ అనే నినాదం ఒక వైపు ఇస్తూ మరొకవైపు విద్య ఆరోగ్యము సాంఘిక సంక్షేమం ఎరువుల సబ్సిడీ ఉపాధి హామీనిబడ్జెట్లో కోతలు విధిస్తూ దేశంలో ఆర్థిక అసమానతలు పెంచి పోషించే విధంగా బిజెపి పార్టీ పరిపాలన సాగిస్తా ఉన్నది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టం లోని ఏ ఒక్క అంశాన్ని గాని పరిష్కారం చేయకుండా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం కరువు కాటకాలతో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు గాని రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు గాని ఎలాంటి నిధులు ఇవ్వకుండా పక్షపాత వైఖరి అవలంబిస్తున్నది  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని రుణమాఫీని రేషన్ కార్డు ప్రామాణికంగా పాసుబుక్ ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు . దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గం సాగు తాగు నిర్ందించే డిండి ఎత్తిపోతల పథకానికి పూర్తి చేయాలని భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటే డిమాండ్ చేశారు. సీసీఐ గ్రామీణ స్థాయి నుండి కార్మిక రైతు పునాదిగా పార్టీ నిర్మించాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యుడు  బి గాలయ్య మాజీ ఎంపిటిసి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ రామలింగయ్య జి రామచంద్రన్ టి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శులు చాపల శీను , నలపరాజు సతీష్ , భిక్షం రెడ్డి , రమేష్ , బూడిద సురేష్ తదితరులు పాల్గొన్నారు.