రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి..

– బొలెరో వాహన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలి..
– పోలీస్ స్టేషన్ బయట ఆందోళన..
నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి మృతి చెందిన ఘటన వేములవాడ రూరల్ మండలం నాగయ్య పల్లె లో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరగగా బాలుడు మృతి చెందాడు. నాగయ్యాపల్లి గ్రామానికి చెందిన సూర రాధ, రాజేశం  కుమారుడు సూర హర్షవర్ధన్ (6) రోడ్డు దాటుతుండగా వేములవాడ నుండి చందుర్తి వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్( బొలెరో) ఢీకొనడంతో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వేములవాడలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ పరుస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యమంలో మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తల్లి దండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీస్ స్టేషన్ బయట ఆందోళన..
తమ కుమారుడి మృతికి కారకులైన బొలెరో వాహన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేపట్టిన కుటుంబీకులు. ఈ విషయంపై కుటుంబీకులు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వారిపట్ల దురుసుగా ప్రవర్తించి, స్టేషన్ బయటకు నెట్టి వేసినట్లు బాధితులుమీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు పట్టించుకోకుండా, తమపై జలుం చెలయించడo ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి, బాలుడి మృతికి కారణమైనబొలెరో కోళ్ల వాహనం డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.బాలుడి తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మారుతి తెలిపారు.