నవతెలంగాణ-రాజేంద్రనగర్
సంక్రాంతి పండుగ ముందు రోజు ఆ కుటుంబంలో విషాదం నెల కొంది. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు కరెంటుషాక్ తగిలి బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ ప్రాంతానికి చెందిన తనీష్(11) స్నేహితుల తో కలిసి లక్ష్మీవాణిటవర్స్ అపార్ట్‌మెంట్ పైన గాలిపటాలు ఎగరవేశారు. ఈ క్రమంలో ఏసీ సరఫరా ఆయ్యే కరెంటు వైర్‌కు తనుష్ చేతులు తాగిలాయి. దాంతో విద్యుద్ఘాతానికి గురై కింద పడిపోయాడు. తోటి పిల్లలకు వెంటనే కుటుంబీకులకు, అపార్ట్‌మెంట్ వాసులకు చెప్పడంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెెళ్లగా బాలుడు మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.