‘ఏ బ్యూటీిఫుల్ గర్ల్’ చిత్ర హీరో నీహాల్ కోదాటి. ‘బటర్‌ఫ్లై ‘చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సరసన హీరోగా, అలాగే ‘ఆహా’వారి ‘పంచతంత్ర’ కథలులో ప్రధాన పాత్రలలో ఒకరిగా, అడివి శేష్ ‘ఎవరు’ చిత్రంలో తన పాత్రతో నీహాల్ కోదాటి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. రవి ప్రకాష్ బోడపాటి జెన్ నెక్ట్స్ మూవీస్ వ్యవస్థాపకుడు, ‘ఏ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్ర రచయిత, దర్శకుడు కూడా. ఆయన ఛార్మి ‘మంత్ర’ చిత్రానికి రచన చేయటంతో పాటుగా నిర్మించాడు. అలాగే ఆయన ఇటీవల అనుపమ పరమేశ్వరన్, భూమిక చావ్లా, నీహాల్ కోదాటి నటించిన ‘బటర్‌ఫ్లై’ చిత్రాన్ని కూడా నిర్మించారు. ‘ఏ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్ర కథానాయిక దృషికా చందర్. న్యూయార్క్‌లో గ్రాడ్యు యేషన్ పూర్తి చేసిన హైదరాబాద్ అమ్మాయి. దృషికా చందర్ నటించిన తొలి చిత్రం ‘మానసానమహ’. ఇటీవలే ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు అందుకున్న చిత్రంగా గిన్నిస్ రికార్డు సాధించింది. 2022లో ఆస్కార్‌కి అర్హత సాధించిన తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. దృషిక జాతీయంగా, అంతర్జాతీయంగా దాదాపు 40 ‘ఉత్తమ నటి’ అవార్డులను గెలుచుకుంది. అలాగే దృషికా రెండు హిందీ చిత్రాలను కూడా పూర్తి చేసింది. అందులో ఒకటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైంది. ఓ మంచి కాన్సెప్ట్‌తో ‘ఏ బ్యూటీఫుల్ గర్ల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందనే దీమాని దర్శకుడు, రచయిత రవి ప్రకాష్ బోడపాటి అన్నారు.