సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ఈనెల 29న రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా ఇందులో ముఖ్య పాత్ర పోషించిన బ్రహ్మాజీ మీడియాతో మాట్లాడుతూ, ”మిస్టర్ ప్రెగెంట్’ సినిమా చిత్రీకరణ టైంలోనే నిర్మాత అప్పిరెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో ఓల్డ్ సిటీలో ఉండే విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే క్యారెక్టర్. మా అబ్బాయి సంజరు డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. ‘పుష్ప’ పార్ట్ 2 చిత్రీకరణ జరుగుతున్నప్పుడు బన్నీ మా ట్రైలర్‌ను చూసి ప్రశంసించారు. ఇందులో నాకు, సప్తగిరికి మధ్య ఉండే సీన్లు పోటాపోటీగా ఉంటాయి. జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్. దీనికి భీమ్స్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారు. మ్యూజికల్ హిట్ అవుతుంది. ప్రస్తుతం ‘గుంటూరు కారం’, ‘సలార్’, ‘భగవంత్ కేసరి’, ‘ఊరి పేరు భైరవకోన’, నాగ శౌర్యతో ఓ సినిమా.. ఇలా చాలానే ఉన్నాయి’ అని చెప్పారు.