వండర్‌లాలో సందర్శకులకు సరికొత్త అనుభూతి

– ప్రముఖ సినీనటి లావణ్య త్రిపాఠి
– వండర్‌ లాలో వాటర్‌ రైడ్లను ప్రారంభించిన లావణ్య
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఉత్తేజకరమైన సరికొత్త వాటర్‌ రైడ్లతో ఒక గొప్ప ఆనందం అందించడానికి సిద్ధమైన వండర్‌లా హైదరాబాద్‌ యాజమాన్యాన్ని ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి అభినందించారు. వండర్‌లా వాటర్‌ పార్క్‌లో సినీనటి లావణ్య త్రిపాఠి సందడి చేశారు. కొంగర రావిరాలలోని వండర్‌లా అమ్యుజ్‌ మెంట్‌ పార్క్‌లో బుధవారం లావణ్య త్రిపాఠి వండర్‌లా హాలిడేస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ కె చిట్టిలపిల్లి, పార్క్‌ హెడ్‌ మధు సూధన్‌ లతో కలిసి రెయిన్బో లూప్స్‌, డ్రాప్‌ లూప్‌ వాటర్‌ గేమ్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీరిక లేని బిజీ జీవితాన్ని గడుపుతున్న నగర ప్రజలకు అమ్యుజ్‌ మెంట్‌ పార్క్‌ అందిస్తున్న ఆటవిడుపులను కొనియాడారు. వండర్‌ హాలిడేస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ కె చిట్టిలపిల్లి, పార్క్‌ హెడ్‌ మధు సూధన్‌లు మాట్లాడుతూ భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్మెంట్‌ పార్క్‌ చెయిన్‌గా ఉన్న వండర్‌లా హాలిడేస్‌ లిమిటెడ్‌ ఎల్లప్పుడూ సరికొత్త అనుభూతులను నగర ప్రజలకు అందించేందుకు కషి చేస్తుందని చెప్పారు. టర్కీ నుండి దిగుమతి చేసిన ఉల్లాసం రేకెత్తించే రెండు వాటర్‌ రైడ్లను పరిచయం చేయడం ద్వారా, సందర్శకుల అనుభవాన్ని సంవద్ధం చేయడానికి వండర్‌లా యాజమాన్యం కట్టుబడి ఉన్నదని తెలిపారు. సందర్శకులకు వినోదం, ఉత్సాహంతో పాటు ఒక మరపురాని అనుభూతిని ప్రతిఒక్కరూ సంపూర్ణంగా ఆనందించే ఒక పర్యావరణాన్ని సష్టించడమనే వండర్‌లా నిబద్ధతను గుర్తు చేస్తుందని వివరించారు. ముందుగా వాటర్‌ వండర్‌లాకు తగిన పేరు సూచించాల్సిందిగా వండర్‌ లా తన సోషల్‌ మీడియా ప్లాట్ఫామ్‌ ద్వారా ఒక పోటీని తీసుకొచ్చింది. ఈ పోటీకి గొప్ప ప్రతిస్పందన లభించింది. పోటీలో పాల్గొన్నవారు దాదాపుగా 357 విభిన్న పేర్లు సూచించారు. ఈ విస్తతమైన ఆలోచనల నుంచి రెండు విలక్షణమైన పేర్లను లోతైన మూల్యాంకనం కోసం ఎంచుకున్నారు. చివరకు, ”రెయిన్బో లూప్స్‌”ని ఎంపిక చేశారు. కార్యక్రమంలో రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.