సరికొత్త కుటుంబ కథా చిత్రం

సరికొత్త కుటుంబ కథా చిత్రంమహాదేవ గౌడ్‌ నూతనంగా నిర్మిస్తున్న సినిమా ‘సఃకుటుంబానాం’. హెచ్‌ ఎన్‌ జి సినిమాస్‌ బ్యానర్‌లో మొదలైంది. ఉదరు శర్మ రచన, దర్శకత్వం చేయగా, రామ్‌ కిరణ్‌ హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు, హీరోయిన్‌గా మేఘ ఆకాష్‌ చేస్తున్నారు. చిత్ర యూనిట్‌ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. నిర్మాత మహాదేవ గౌడ్‌ మాట్లాడుతూ,’అచ్చమైన తెలుగింటి టైటిల్‌ అని అందరూ మెచ్చుకుంటున్నారు. రేషన్‌ కార్డు డిజైన్‌లా ఉన్న పోస్టరే కాదు సినిమా కూడా మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మా నందం, సత్య, రాజశ్రీ నాయర్‌, శుభలేఖ సుధాకర్‌, భద్రం, తాగుబోతు రమేష్‌, నిత్యశ్రీ, రమేష్‌ భువనగిరి, శ్రీప్రియ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ మ్యుజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యుజిక్‌ అందిస్తున్నారు’ అని తెలిపారు.