సరికొత్త అనుభూతినిచ్చే ‘సంబరాల ఏటిగట్టు’

'Samarala Etigattu' gives a new experienceహీరో సాయి దుర్గ తేజ్‌ తాజాగా నటిస్తున్న చిత్రానికి ‘సంబరాల ఏటిగట్టు’ అనే ఆసక్తికర టైటిల్‌ని మేకర్స్‌ ఖాయం చేశారు. ‘హనుమాన్‌’ వంటి సెన్సేషనల్‌ పాన్‌ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పై ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టైటిల్‌ రివీల్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న హీరో రామ్‌ చరణ్‌ ‘కార్నేజ్‌’ టీజర్‌ను లాంచ్‌ చేశారు. కార్నేజ్‌ వీడియో సాయి దుర్గ తేజ్‌ విధ్వంసక, ఇంటెన్స్‌ క్యారెక్టర్‌కు స్నీక్‌ పీక్‌ అందిస్తోంది. ఈ పాన్‌-ఇండియా ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 25న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. ఈ సంద్భరంగా హీరో రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ,’తేజ్‌ ప్రతి క్యారెక్టర్‌కి తపన పడతాడు. కష్టపడతాడు. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. అవుట్‌ స్టాండింగ్‌ విజువల్స్‌. రోహిత్‌కి ప్రత్యేకంగా థాంక్స్‌ చెప్తున్నాను. తను ఫస్ట్‌ సినిమా చేస్తున్నట్టుగా లేదు. చాలా అద్భుతంగా ఉంది. తేజ్‌ మీద ఇంత పెద్ద బడ్జెట్‌ పెడుతున్నందుకు నిర్మాతలు నిరంజన్‌, చైతన్యకి ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ఈ సినిమాతో చాలా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కొట్టి మంచి న్యూస్‌ కూడా వినిపించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.