సరికొత్త ప్రేమకథ

A brand new love storyకృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలు కూరి ఆకాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్‌ పై హైమావతి, శ్రీరామ్‌ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో తాజాగా మేకర్స్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు. ఆగస్ట్‌ 2న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. టాప్‌ ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యుషన్‌ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్‌ చేశాయి. బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిన, వెంకటేష్‌ కాకమును, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రచన – దర్శకత్వం :చిలుకూరి ఆకాష్‌ రెడ్డి, అసోసియేట్‌ నిర్మాత: విక్రమ్‌ జమ్ముల, డీవోపీ: ప్రేమ్‌ సాగర్‌, సంగీతం: శశాంక్‌ తిరుపతి, ఎడిటర్‌:జే సి శ్రీకర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ :గద్దల అన్వేష్‌, సాహిత్యం : చంద్రబోస్‌, రాకేందు మౌళి, శ్రేష్ట, భరద్వాజ్‌ గాలి, డా.జి.సుమతి, సహ రచయిత : శ్రీకాంత్‌ మందుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ : రవిదర్‌.పి, స్టంట్‌ మాస్టర్‌ :వింగ్‌ చున్‌ అంజి, కొరియోగ్రఫీ :-వై. మెహర్‌ బాబా, అజ్జు.