చేతన్ కష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. సాయి కిషోర్ మచ్చా దర్శకుడు. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నవంబర్ 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో టీజర్ చాలా బాగుందని, మూవీ టీమ్‌కు మారుతి బెస్ట్ విషెస్ తెలిపారు. హీరో, హీరోయిన్లు చేతన్ కష్ణ, హెబ్బా పటేల్ లవ్ స్టోరీతో టీజర్ ప్రారంభమైంది. ఈ లవ్‌స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్‌తో తెలుస్తోంది. చేతన్ కష్ణ చేసిన విలేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ పెళ్లి సందడిలో డిజైన్ చేసిన కామెడీ ట్రాక్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్, కామెడీ..ఇలా థియేటర్‌లో ప్రేక్షకుడు చూసి ఎంజారు చేసే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ టీజర్ ఇంప్రెస్ చేస్తోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఇదొక భిన్న ప్రేమకథా చిత్రం. ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథలతో పోలిస్తే ఇది చాలా వినూత్నంగా ఉంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల పాత్రలు అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తాయి. ఈ పాత్రలతో ప్రేక్షకులు ట్రావెల్ అవుతారు. ఇక వినోదం పుష్కలంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా అందర్నీ మెప్పిస్తుంది’ అని దర్శకుడు సాయికిషోర్ మచ్చా అన్నారు.