హీరో విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న ‘మెకానిక్ రాకీ’ దీపావళి రేసులో ఉందని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 31న విడుదల కానుంది. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా శ్రద్ధా శ్రీనాథఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు.