‘చక్రవ్యూహం’ – ది ట్రాప్ ( ఉపశీర్షిక ) ట్రైలర్‌ను యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. విలక్షణ పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. మిస్టరీ క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ కథని మధుసూదన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై సావిత్రి నిర్మించారు.
ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 2న థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది.
‘సినిమా సినిమాకి అందులో ఉన్న పాత్రకి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్, హావభావాలతో తగిన న్యాయం చేస్తూ ఎదిగిన నటుడు అజయ్ ఈ క్రైమ్ స్టోరీలోను అదే రీతిన ప్రేక్షకుల మెప్పు పొందుతారు. ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్‌ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథపై మరింత ఆసక్తి పెంచింది. మరోసారి అజయ్ తన అద్భుతమైన నటన కనపరిచాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా ప్రేక్షుకులను ఆకట్టుకుంది. ఈ సినిమా నైజాం, సీడెడ్ హక్కులని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశిధర్ రెడ్డి కొనుగోలు చేశారు’ అని చిత్ర బృందం తెలిపింది.