రామ్ కార్తీక్, కశ్వి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొంది స్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత పి.పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ, ‘టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈనెల 18న థియేటర్స్‌లోకి వస్తున్న మూవీని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘ఎక్కడా ల్యాగ్ లేకుండా మిమ్మల్ని ఎంగేజ్ చేసే చిత్రమిది. ఫన్, లవ్, సస్పెన్స్, మిస్టరీ వంటి అన్ని ఎలిమెంట్స్ మా సినిమాలో అలరిస్తాయి’ అని మరో నిర్మాత అశోక్ రెడ్డి చెప్పారు. ‘హీరో వెంకటేష్ ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసు కోవడం. ఆయన చెప్పిన ఆ మాటే మా సినిమాకు కథా నేపథ్యం. మా చిత్రంలో హీరో ఎప్పుడూ పక్కోడి లైఫ్‌లో ఏం జరుగుతుందో చూడాలనే ఉత్సాహంలో ఉంటాడు. ఆ ఉత్సాహం వల్ల అతనికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం’ అని దర్శకుడు మనోజ్ పల్లేటి చెప్పారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమలోనూ మా అందరికీ మంచి గుర్తింపు తెస్తుంది’ అని అన్నారు.