మానకొండూరు నియోజకవర్గంలోని విద్యార్థుల భవిష్యత్తుకు వారధి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలని కవ్వంపెల్లి యువ సేన వ్యవస్థాపకుడు కత్తి రమేష్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి శంకుస్థాపన చేయడం అభినందనయమని కత్తి రమేష్ కొనియాడారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు.