
జీవశాస్త్రంపై విద్యాభ్యాసంతో మహిళలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నా లజీ మాజీ సలహాదారులు, మాజీ సైంటిస్ట్ డాక్టర్ మీనాక్షి మున్షీ అన్నారు. శుక్రవారం తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ, బయోక్లూస్ ఆర్గనైజేషన్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో ఉమెన్ ఇన్ బయోలాజీ అనే అంశం పై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆమె టీఎంవీ ఇంచార్జి వీసీ ప్రొఫెసర్ ఎం విజ్జులత,టీఎంవీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ సరస్వతమ్మ, సదస్సు కన్వీనర్ డాక్టర్ రూపశ్రీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మంజరి, డాక్టర్ జ్యోతి లతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ ద్వారా మహిళలు జీవశా స్త్రంలో రాణించేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. జీవశాస్త్రంలోని మెళకువలను తెలుసుకొని మహిళలు బయోటెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలపై క్లుప్తంగా వివరించారు.టీఎంవీ ఇంచార్జి వీసీ ప్రొఫెసర్ ఎం విజ్జులత మాట్లాడుతూ తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి సారి మహిళల కోసం ప్రత్యేక సదస్సును నిర్వహించడం అభినందనీ యమని అన్నారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థిణులు జీవశాస్త్రంలోని మెళకువలను తెలుసుకునేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో కళాశాల విద్యార్ధిణులతో పాటు జాతీయ స్థాయిలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.