జీవితంలో చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

Education is the bright future in life– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్
నవతెలంగాణ – రాయపోల్ 

ప్రతి మనిషి తన జీవితంలో ఉజ్వల భవిష్యత్తు చదువుతూనే లభిస్తుందని విద్య ద్వారానే సమాజంలో ఉన్నత విలువ గుర్తింపు లభిస్తాయని, ప్రతి ఒక్కరు చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనుభ్యసించి త్రిబుల్ ఐటీకి ఎంపికైన దీక్షిత, పవన్ కుమార్ లను ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా పేద విద్యార్థులే విద్యను అభ్యసిస్తున్నారని అలాంటి విద్యార్థులకు సరైన ప్రోత్సాహం లభిస్తే మట్టిలో మాణిక్యాలు తయారవుతారన్నారు. ఇటీవల ప్రకటించిన ఐఐఐటీ ఫలితాలలో బేగంపేట విద్యార్థులు ఏర్పుల దీక్షిత, ఒగ్గు పవన్ కుమార్ ఇద్దరు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఇద్దరు విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులు త్రిబుల్ ఐటీకి ఎంపిక కావాలన్నారు. విద్యార్థి దశ నుండే లక్ష్యాన్ని ఎంచుకొని చదువుకోవాలన్నారు. పదవ తరగతి విద్యార్థులు 10 జిపిఏ లక్ష్యంగా ఇప్పటి నుంచే చదవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత నాణ్యమైన విద్యాబోధన అందించడం  రుగుతుందన్నారు. అందరూ ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. సంపద హోదా ఇవ్వలేని గౌరవం, విలువ చదువు ద్వారా మాత్రమే లభిస్తాయన్నారు. కాబట్టి విద్యార్థులు అందరూ చదవాలి అందరూ ఎదగాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి బేగంపేట విద్యార్థులకు సన్మానం చేసిన ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, జర్నలిస్ట్ మన్నే గణేష్, పాఠశాల ఉపాధ్యాయులు నవీన్ కుమార్, సంజీవ్, రాములు గౌడ్, నర్సింలు గౌడ్, నరేందర్, ప్రభాకర్, భాస్కర్ రెడ్డి, వసంత, దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, వసంత, పావని, సిఆర్పి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.