
నవతెలంగాణ-పెద్దవంగర: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. సోమవారం తొర్రూరు లో జరిగిన కేటీఆర్ బహిరంగ సభకు వెళ్లే వాహనాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంత్రి ఎర్రబెల్లిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలి వెళ్లారు.