– నిప్పుపెట్టి కాల్చిచంపిన దుండగులు
నవతెలంగాణ-సదాశివనగర్
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులోని కాళేశ్వరం కాలువ పక్కన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. మృతదేహం ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదాశివనగర్ సీఐ రామన్, ఎస్‌ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బుధవారం రాత్రి యువతిని గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి కాల్చివేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు, యువతి ఎవరనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.