పిడుగు పాటుకు గేదె మృతి

A buffalo died due to lightningనవతెలంగాణ – తొగుట 
పిడుగు పాటుకు గేదె మృతి చెందిన సంఘటన మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో చోటు చేసుకుంది.శుక్రవారం గ్రామానికి చెందిన సుతారి మల్లేశం వ్యవసాయ పొలం వద్ద ఎప్పటిలాగే  మధ్యాహ్నం పశువులను మేతకు వదిలాడు. ఈ క్రమంలో ఉరుములు మెరుపులతో పిడుగు పడ టం తో మేత మేస్తున్న గేదె అక్కడికక్కడే పడి పోయింది. మల్లేశం వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందిందని ఆవేదను వ్యక్తం చేశారు. గేదె మరణం తో రూ. 20 వేల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.