సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజరు, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను, ఇందులోని జానపద పాట ‘యాదమ్మ..’ సాంగ్‌ను మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేసి, విలేకరులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ,’మా బ్యానర్‌లో ఇది 95వ సినిమా. మలయాళంలో 96వ సినిమా చేస్తున్నాం. అలాగే 97, 98 సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలో 100 సినిమాలకు చేరుకోబోతున్నాం. దర్శకుడు ఈ సినిమాను చక్కగా తీశాడు. ఆల్ రెడీ సాంగ్స్ వెరీ గుడ్. సంగీత దర్శకుడు చరణ్ గొప్ప టాలెంట్ పర్సన్’ అని అన్నారు. ‘చరణ్ అర్జున్ సంగీతం ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. విఎస్ ఆర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పనితనంతో సినిమా మరింత బాగా వచ్చింది’ అని దర్శకుడు చెప్పారు.న