పిడుగు పడి ఎద్దు మృతి..

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని బాలాజీ నగర్ గ్రామానికి చెందిన అజ్మీర సారయ్య అనే రైతుకు సంబంధించిన ఎద్దు మంగళవారం రాత్రి పడిన వర్షానికి పిడుగు పడి మృతి చెందింది. ఎద్దు విలువ 60 వేల రూపాయలు ఉంటుందని అచన ఈ సమయంలో ఎద్దు మృతి చెందడం బాధాకరమని గ్రామస్తులు అంటున్నారు. వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడి జీవించే సారయ్యకు ప్రభుత్వం సహకారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. దుక్కి దున్నే సమయంలో పిడుగు పడి ఎద్దు మృతి చెందడంతో సారయ్య కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మండలంలోని పసర గ్రామంలోని వైన్ షాప్ సమీపంలో కూడా తాడిచెట్టు పై పిడుగు పడి మంటలు మండాయి మంగళవారం అంగడి కావడంతో ఆ ప్రాంతంలో జన సమర్థం అధికంగా ఉండే మండల చూసి ప్రజలు బెంబేలెత్తిపోయారు.