బస్సు- లారీ ఢీకొని  పలువురికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ- శంకరపట్నం: బస్సు లారి ఢీకొని పలువురికి తీవ్ర గాయాలైన ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలం తాడికల్  గ్రామ శివారులో మూలమలుపు వద్ద వరంగల్ నుండి నిజామాబాద్, వెళుతున్న ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి హుజూరాబాద్ వైపు వెళ్తున్న లారీనీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలైన ఎండి హైమద్ అలీ, డ్రైవర్ ఎండి నవాజ్, ఎండి సోహెల్ పాషా, మరియు ఆరోగ్యం,అనే వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో  సిబ్బంది ఈఎంటి  సతీష్ రెడ్డి, పైలెట్ కాజా ఖలీల్, సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ  హాస్పిటల్ కు తరలించారు.