కంటేశ్వర్ లో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి 

A bus shelter should be established in Dineshwar– షెల్టర్ లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు 

– కంటేశ్వర్ లో కొన్నిచోట్ల ఉన్న నిరుపయోగం 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అందుకు అనుగుణంగా ఆర్టిసి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని అనడానికి నిదర్శనం కంటెశ్వర్ ప్రాంతం. దశాబ్దాల కాలంగా కంటేశ్వర్ ప్రాంతంలో బస్సు ఎక్కాలి అన్న దిగాలన్న ఆ ప్రాంతాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుండి నిర్మల్ మెట్పల్లి జగిత్యాల్ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే కంటేశ్వర్ దాటి వెళ్లాల్సిందే. ఇతర ప్రాంతాల నుండి బస్సు బస్టాండ్ కి రావాలంటే కంటేశ్వర్ ప్రాంతం చేరుకున్నాకే బస్టాండ్కు రావాల్సిన పరిస్థితి గత కొన్ని ఏళ్లకాలం నుండే ఉంది. ఎందుకనుగుణంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కంటేశ్వర్ ప్రాంతం ప్రధానంగా మారింది. అయితే ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ లేక నిజామాబాద్ నగర ప్రజలు చాలా ఇబ్బందులకు గురి కావలసిన పరిస్థితి నెలకొంది. సుమారు సంవత్సరాల కాలంగా కంఠేశ్వర ప్రాంతంలో బస్సు ఎక్కేందుకు బస్సు షెల్టర్ ను మార్చారు. కంటేశ్వర్ గుడి ప్రధాన ద్వారం ముందు ఎక్కాల్సిన బస్సును వెనుక ద్వారా ఎక్కాలచిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ వేచి ఉన్న ప్రజలు బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ఎప్పుడు అదే ద్వారం గుండా వెళ్లే బస్సులు కంటెశ్వర్ ముఖ ద్వారం ముందు నిల్చుని చూస్తే ఏ బస్సు ఏమిటి అనేది తెలిసేది. ప్రస్తుతం ఎక్కాల్సిన ప్లేస్ లో నుండి చూస్తే ఏ బస్సు దగ్గరికి వస్తే గాని తెలియని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు పెరుగుతున్న జనాభా కనుగుణంగా బస్సులు సైతం పెరగడంతో ఏ బస్సు ఎప్పుడొస్తుందో అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. సమయంలో కేటాయించిన ఒకే సమయంలో రెండు మూడు బస్సులు వచ్చేసరికి ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల వరకు అక్కడ ఆర్ టి సి సిబ్బంది ఒకరిని ఉంచి ప్రయాణికులకు హెల్ప్ చేసేందుకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరు కూడా ఉండడం లేదు. అదేవిధంగా గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం కంఠేశ్వర ప్రాంతం తో పాటు తదితర ప్రాంతాలలో బస్సు సెంటర్లను అవసరమున్న చోట ఏర్పాటు చేయాలి కానీ అలా చేయకుండా కంటేశ్వర్ కు కూతవేటు దూరంలో ఎడమ పక్కన కుడి పక్కన 100 మీటర్ల చొప్పున రెండు మూడు ఏర్పాటు చేశారు కానీ అవి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల గోడును పట్టించుకోని ప్రజలకు సౌకర్యార్థం బస్సు షెల్టర్ లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.