నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదగిరిగుట్ట నుంచి నాగిరెడ్డిపల్లి గ్రామంలోని రమలేశ్వరంలోని గోల్డెన్ టెంపుల్ వరకు బస్సు ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం రమనేశ్వరం ఇంచార్జ్ బలరాం యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఆధ్వర్యంలో రమనేశ్వరంలో నిర్వహించబడుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక శివ మహా క్షేత్రమునకు ప్రతిరోజు సుమారు 600 మంది భక్తులు వస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాదగిరిగుట్ట డిపో నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు బస్సు ఏర్పాటు చేయాలని కోరారు.