సందడిగా మారిన షెట్కార్‌ ఫంక్షన్‌హాల్‌

A bustling Shetkar function hall– మూడోరోజుకు చేరిన ఢిల్లీ వసంత్‌ 72 గంటల సామూహిక ప్రార్థన పాదయాత్రతో చేరుకున్న కాశీంపూర్‌ రైతులు
– డాక్టరేట్‌ జనార్ధన్‌కు ఘనమైన సన్మానం
నవతెలంగాణ-జహీరాబాద్‌
స్థానిక ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారంలో దళితబంధు లబ్ధిదారులను వాటాదారులుగా మార్చి.. కర్మాగారాన్ని జహీరాబాద్‌ రైతులకు సొంతం చేయా లనే సంకల్పంతో 72 గంటల పాటు సామూహిక ప్రార్థనలకు ఢిల్లీ వసం త్‌ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా బుధవారం నాటికి ఈ కార్యక్రమం మూడోరోజుకు చేరింది. మంగళవారం రాత్రి జహీరాబాద్‌, న్యాల్కల్‌ మండలాల నుంచి వచ్చిన మహిళా బందాలతో భజన కార్యక్రమం జరిగింది. బుధవారం నాటికి మండలంలోని కాసింపూర్‌ గ్రామ రైతులు ఢిల్లీ వసంత్‌ సంకల్పానికి నైతిక మద్దతుగా నిలుస్తూ పాదయాత్ర ద్వారా షెట్కార్‌ ఫంక్షన్‌ హాల్‌ కి చేరుకున్నారు. రైతులు గొల్ల శంకర్‌, పెద్దగొల్ల మల్లేశం, పెద్దగొల్ల బక్క న్న, వడ్డెర చంద్రన్న, అల్గోల్‌ పాపయ్య, వడ్డెర హనుమంతు, కుష్‌ నూరు అర్జున్‌లు వర్షంలో తడుస్తూ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకోగా.. గ్రామ వారికి ఘనమైన స్వాగతం తెలిపారు. సామూహిక ప్రార్థనలో భాగంగా కవ్వాలి సంగీత బదం, పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
డాక్టరేట్‌ జనార్ధన్‌కి ఘన సన్మానం
గత రెండున్నర ఏండ్లుగా జయహౌ జహీరాబాద్‌ నినాదంతో ముందుకు పోతున్న ఢిల్లీ వసంత్‌కు నైతిక మద్దతుగా నిలిచి.. జహీరాబాద్‌ అభివద్ధికై విశిష్ట సేవలు అందిస్తున్న ఇప్పపల్లి వాసి నౌలేగారి జనార్దన్‌ ఉన్నత విద్యతో పీహెచ్‌డీ పట్టా పొంది డాక్టరేట్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా జయహౌ జయరాబాద్‌ బందం షెట్కార్‌ ఫంక్షన్‌ హాల్‌లో జనార్దన్‌ను ఘనం గా సన్మానించారు. వారి కుటుంబ సభ్యులకి శాలువాలు కప్పి ప్రశంసించారు. మట్టిలో మాణిక్యంగా జనార్దన్‌ సేవలు జహీరాబాద్‌ అభివద్ధికి ఎంతో అవస రమని కొనియాడారు. జహీరాబాద్‌ యువత కోసం, నైపుణ్య శిక్షణ అభివద్ధి కో సం స్కిల్‌ బ్యాంక్‌ ఆలోచనను డాక్టర్‌ జనార్దన్‌ ప్రతిపాదించగా ఢిల్లీ వసంత్‌ చేపట్టిన జయహౌ జయరాబాద్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా మాజీ మంత్రి కీర్తిశేషులు ఫరీదుద్దీన్‌ సమాధి వద్ద ఈ స్కిల్‌బ్యాంక్‌ సాంకేతికను ఆవిష్కరించారు.
ఢిల్లీ వసంత్‌ ప్రతిపాదనకు విశేష మద్దతు..
దళితబంధు పథకంపై ఢిల్లీ వసంత్‌ చేసిన ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నది. రైతు సంఘాలు, వాణిజ్య సంఘాలు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంస్థలు, ఎన్జీవోలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న సామాజిక వ్యక్తులు ఆయనకు నైతిక మద్దతు ప్రకటించారు. ఈ ఆలోచన విధానం అమలు చేసే లక్ష్యంలో తమ వంతు సహకారం అందిస్తామని విశ్వాసం ఇచ్చారు. మూడో రోజు కార్యక్రమాల్లో మహిపాల్‌ యాదవ్‌, బిల్లీ పురం మాధవరెడ్డి, మొహమ్మద్‌ యాదుల్ల, మాదినం శివ, యాసిర్‌ ఖాన్‌, గోవింద్‌ రెడ్డి, సురేష్‌, బాల్‌ రాజ్‌, మల్లేష్‌ యాదవ్‌, కరణం రవి, దినేష్‌, ఓంకార్‌, విష్ణు, శ్రీకాంత్‌, ముదిగొండ శ్రీనివాస్‌, భూమన్‌ స్టీవెన్సన్‌ తదితరులు పాల్గొన్నారు.