నిండా మునిగిన రైతు

– న్యాక్‌ సంస్థ ఇచ్చిన విత్తనాలు
– రాబడులు రాక రైతుల ఆవేదన
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కొడంగల్‌
రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తే పంట చేతికి వచ్చే సమయానికి పచ్చ జొన్న కంకులు రాకపోవడంతో రైతులు తెచ్చిన అప్పు ఏ విధంగా తీర్చాలో అని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. దౌల్తాబాద్‌ మండలంలోని రైతు సరఫరా సహకార పరిమితి సంఘంలో రైతులు పచ్చ జోన్న విత్తనాలు కొనుగోలు చేసి పంట వేస్తే కంకులు రాలేదని దౌల్తాబాద్‌, గోక పసలవాద్‌, అంతారం, బాలంపేట గ్రా మాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాక్‌ సంస్థ ఇచ్చిన విత్తనాలను రైతులు తమ పొలంలో వేసిన పంట ఏపుగా పెరిగిన కంకులు లేకపోవడంతో రైతులు తెల్ల మొహాలు వేశారు. ఎకరాకు వీరన్న పెట్టుబడులు పె డుతూ చివరకు పంట దిగుబడులు రాకపోవడంతో అధికా రుల దష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని వాపో తున్నారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన 6 ఎక రాలు, గోక పసలవ గ్రామానికి చెందిన రైతు 8 ఎకరాలు, అంతారం కావాలి గ్రామానికి చెందిన రైతులు 5 ఎకరాలు, బలంపేట గ్రామానికి చెందిన రైతు 6 ఎకరాలు పచ్చ జొ న్న పంటను వేశారు. అధిక దిగుబడులు వస్తాయని అధికా రులు తెలపడంతో రైతులు పచ్చన జోన్న పంటను వేశారు. పచ్చ జోన్న పంట కంకులు రాకపోవడంతో నష్ట పోయా మాని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూన్నారు.