జోరందుకున్న నామినేషన్ల పర్వం

– ఉమ్మడి జిల్లాలో 29 నామినేషన్లు దాఖలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
నామినేషన్ల గడువు సమయం దగ్గర పడుతున్న కొద్ది నామినేషన్లు జోరందుకుంటున్నాయి సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 11 నామినేషన్లు సూర్యాపేట జిల్లాలో 10 నామినేషన్లు భువనగిరి యాదాద్రి జిల్లాలో 8 నామినేషన్ను దాఖలు అయ్యాయి ఇందులో ఇందులో కొందరు రెండో సెట్‌ గా నామినేషన్‌ వేశారు. ఇంకా కేవలం మూడు రోజుల మాత్రమే గడువు ఉండడంతో నామినేషన్లు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. నేడు మంగళవారం కావడంతో నామినేషన్‌ వేసినందుకు అభ్యర్థులు ఆసక్తి చూపించరు. 8న బుధవారం 9న బుధవారం 10న శుక్రవారం మూడు రోజులు మంచి రోజులు ఉండడంతో ఈ మూడు రోజుల్లోనే ఎక్కువ మంది నామినేషన్‌ వేయనున్నారు. ప్రధానంగా ఈనెల 9న ఏకాదశి కావడంతో అదేరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు 16 రెండో రోజు శనివారం 28 నామినేషన్‌ వచ్చాయి ఇప్పటివరకు 3 రోజులకు గాను మొత్తం 73 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నల్గొండలో 11 నామినేషన్లు..
మిర్యాలగూడ నియోజకవర్గంలో సోమవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున బంటు రవి స్వతంత్ర అభ్యర్థిగా బోలా సాని కష్ణయ్య, బిజెపి తరఫున జవాజి సత్యనారాయణ నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఇప్పుడు వరకు ఈ నియోజకవర్గంలో నుండి ఇద్దరు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు గతంలోనే దాఖలు చేశారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుండి ఐదు నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య తెలిపారు. సోమవారం మిర్యాలగూడ గూడ కు చెందిన పోతుగంటి కాశయ్య ఎంసీపీఐయూ పార్టీ తరుపున నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా ఇప్పటి వరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. దేవరకొండలో రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా కేలా వత్‌ వస్య నాయక్‌. బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా మూడవత్‌ వెంకటేష్‌ ,నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఇప్పటివరకు దేవరకొండ నియోజకవర్గంలో 6 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నల్గొండలో పిల్లి రామరాజు ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి మరో సెట్‌ దాఖలు చేశారు. మునుగోడు నియోజకవర్గం లో సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున కర్నాటి వెంకటయ్య, ఇండిపెండెంట్గా కిన్నెర యాదయ్య, నర్సి స్వామీలు నామినేషన్లు వేశారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో భోజన సమాజ్‌ పార్టీ తరపున రాణి ప్రియదర్శిని నామినేషన్‌ వేశారు.
సూర్యాపేట జిల్లాలో 10 నామినేషన్లు..
దాఖలు అయ్యాయి. సూర్యాపేట నియోజకవర్గం నుండి సోమవారం మూడు నామినేషన్‌ దాఖలు అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా ఒగ్గు వెంకన్న, మారం వెంకటరెడ్డి, రిపబ్లిక్‌ సేన పార్టీ తరఫున కిరణ్‌ వంగపల్లి నామినేషన్‌ దాఖలు చేశారు. హుజూర్‌ నగర్‌ నియోజక వర్గంలో ఎం సి పి ఐ యు పార్టీ నుంచి వస్కుల సైదమ్మ నామినేషన్‌ దాఖలు చేశారు. కోదాడ నియోజక వర్గంలో ఆల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ నుండి డా. మల్లెబోయిన ఆంజనేయులు, సరసాని సుధాకర్‌ రెడ్డి, ఉపేందర్‌ తండు, గంగిరెడ్డి కోటి రెడ్డి ఇండిపెండెంట్‌ గా నామినేషన్‌ వేశారు. మెరిగా సైదాబాబు ధర్మ సమాజ్‌ పార్టీ తరుపున వేశారు. కోదాడలో మూడు నామినేషన్‌ దాఖలు అయ్యాయి. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌ బి) తరపున మల్లెబోయిన అంజి యాదవ్‌, ధర్మసమాజ్‌ పార్టీ నుండి మెరిగా సైదాబాబు , స్వతంత్ర అభ్యర్థిగా సుధాకర్‌ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఇటికాల చిరంజీవి నామినేషన్‌ దాఖలు చేశారు.
యాదాద్రి భువనగిరిలో 8 నామినేషన్లు…
భువనగిరి నియోజకవర్గం లో నాలుగు నామినేషన్లు వచ్చాయి.నల్ల నరేందర్‌( ధర్మసమాజ్‌ పార్టీ) నేల్ల నరసింహ (అలియాన్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ), స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్లు ,పంజాల సురేష్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ సోమవారం భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అధికారికి అందజేశారు. ఆలేరు నియోజకవర్గంలో నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి. పెంట రమేష్‌ (బహుజన ముక్తి పార్టీ ),వి.శ్రీనివాస్‌ రెడ్డి (స్వతంత్ర),గజ్జల రామచంద్రారెడ్డి (స్వతంత్ర ), శివకుమార్‌ (ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ)ల నుండి నామినేషన్‌ ఆలేరు ఎన్నికల అధికారికి అందజేశారు.