ముధోల్ లో ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం

A calm ending immersion in Mudholనవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో శుక్రవారం ప్రారంభమైన గణేష్ నిమజ్జనం వేడుకలు శనివారంతెల్లవారుజామున ముగిశాయి.ప్రశాంతగా గణేష్ నిమజ్జనం వేడుకలు మగియటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.ముధోల్ పై ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ లు ప్రత్యేక శ్రద్ధ   తీసుకోని  బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ముధోల్ లో గణేష్ నిమజ్జనం బందోబస్తు ను శుక్రవారం రాత్రి వరకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పర్యవేక్షించారు. ముధోల్ లో జరుగుతున్న నిమజ్జనం ఏర్పాటు ను, రూట్ మ్యాప్ ను ఓక్కరోజుముందుగాపరీశీలించారు.శుక్రవారం ఉదయం ఎస్పీ ముధోల్ కు చేరుకొని నిమజ్జనం బందోబస్తు ను ముందుగా పర్యవేక్షించారు,పలు సూచనలు, సలహాలను స్థానిక సిఐ మల్లేష్, ఎస్ఐ సాయికిరణ్ కు తెలియజేశారు. ఎస్పి ముధోల్ మండలంలో నిమజ్జనం బందోబస్తు పై కూడాప్రత్యేకచర్యలుతీసుకున్నారు.రెండు రోజుల ముందు తరోడ గ్రామంలో గణేష్ నిమజ్జనంబందోబస్తునుఎస్పీపరిశీలించారు.అలాగే గణేష్ మండలినిర్వహకులు , ఉత్సవ సమితి సభ్యులు,పోలిసుల కు సహకరించారు.దీంతో ముధోల్ మండలంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది.  ముదోల్ లో బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ,ఎస్సై సాయికిరణ్ ,నిమజ్జనం బందోబస్తును మోటార్ సైకిల్ పై గల్లీ గల్లీ కీ వేళ్లీ పర్యవేక్షించారు.ముధోల్ లో  గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రదాన కూడళ్ళలో పికెటింగులు, భారీ బందోబస్తు ను భైంసా ఎ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలిసులు చెప్పట్టారు. దీంతో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగటంతో పోలిసుల ను పలువురు అభినందించారు.